Nov 13,2020 21:29

న్యూఢిల్లీ : తైవాన్‌కు చెందిన ఎలక్టాన్రిక్స్‌ సంస్థ అసుస్‌ తాజాగా ఇంటెల్‌ 11వ తరం శక్తివంతమైన ల్యాప్‌టాప్‌లను ఆవిష్కరిస్తున్నట్లు వెల్లడించింది. తాజా 11వ తరపు ఇంటెల్‌ కోర్‌ ప్రాసెసర్లుతో కూడిన ఈ అల్టా స్లిమ్‌ డిజైన్‌, చూడగానే సంతృప్తి పరిచే సౌందర్యం, కస్టమ్‌ ఇంటిలిజెంట్‌ కూలింగ్‌ పరిష్కారాలు, వేగవంతమైన ర్యామ్‌, విస్తరించతగిన స్టోరేజీ, నానో ఎడ్జ్‌ డిస్‌ప్లేతో కూడిన ఈ అత్యంత శక్తివంతమైన ల్యాప్‌టాప్‌లు మెరుగైన పనితీరు, లీనమయ్యే విజువల్స్‌, ఎదురులైని పనితీరు అందిస్తాయని తెలిపింది. వీటిలో వివో బుక్‌ అల్టా 14/15 (ఎక్స్‌413/ఎక్స్‌513), వివోబుక్‌ అల్టా కె15(కె513), జెన్‌బుక్‌ 14(యుఎక్స్‌ 425) ఉన్నాయని పేర్కొంది. వినియోగదారుల అనుభవాలను మెరుగుపరుస్తామనే తమ నిబద్ధతకు అనుగుణంగా, అసుస్‌ ఇప్పుడు జెన్‌ జెడ్‌ అవసరాలను దఅష్టిలో పెట్టుకుని అత్యంత ఖచ్చితత్త్వంతో కూడిన ఇంజినీరింగ్‌తో ఈ మొత్తం శ్రేణి ఉపకరణాలను రూపొందించిందని తెలిపింది. వీటి ధరల శ్రేణీ రూ.42,990 నుంచి ప్రారంభమవుతుందని పేర్కొంది.