Nov 29,2020 22:13

నిరసన తెలుపుతున్న సిపిఎం నాయకులు

ప్రజాశక్తి - విజయవాడ
రాష్ట్ర ప్రభుత్వం తీసుకువస్తున్న ఆస్తి పన్ను పెంపు జీఓను రద్దు చేయాలని కోరుతూ 33వ డివిజన్‌ సత్యనారాయణపురంలో సిపిఎం ఆధ్వర్యంలో ఆదివారం నిరసన కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు టి.ప్రవీణ్‌ మాట్లాడుతూ ఆస్తి పన్ను పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొస్తున్న జీఓను రద్దు చేయకుంటే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఆస్తి పన్ను, చెత్త పన్ను, మంచినీటి చార్జీలు, డ్రైనేజి పన్ను ఇలా వివిధ రూపాల్లో చట్ట విరుద్దంగా ప్రజలపై మోపుతున్న భారాలను విరమించుకోవాలని డిమాండ్‌ చేశారు. అద్దె ప్రాతిపదికన కాకుండా ఆస్తి విలువ ఆధారంగా పన్నులు పెంచాలని ప్రభుత్వం నిర్ణయించడం తగదన్నారు. కేంద్రంలోని మోడీ ప్రభుత్వం అమలు చేస్తున్న పట్టణ సంస్కరణల్లో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం వివిధ రూపాల్లో భారాలు మోపాలని నిర్ణయించడం ప్రజల ఆగ్రహానికి గురికావాల్సి వస్తోందని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు పి.కృష్ణమూర్తి, మురళి, ఎస్‌కె పీరు, ఎస్‌కె ఇమామ్‌, ట్యాక్స్‌ పేయర్స్‌ అసోసియేషన్‌ నాయకులు ఎంవి ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు.