Nov 24,2021 18:33

'మనసానమ:'  ఆస్కార్‌కు అర్హత సాధించిన మొట్టమొదటి తెలుగు చిత్రం. ఈ చిత్రం ఇప్పుడు అకాడమీ సభ్యుల ఓటింగ్‌ కోసం ప్రదర్శితవుతోంది. నూతన దర్శకుడు దీపక్‌ రెడ్డి దర్శకత్వం వహించిన ఈ షార్ట్‌ ఫిల్మ్‌ 2020లో విడుదలైంది. అప్పటి నుండి 950 అంతర్జాతీయ అవార్డులను గెలుచుకుంది. 300 అంతర్జాతీయ చలన చిత్రోత్సవాల్లో ప్రదర్శితమైంది. ఆస్కార్‌ బరిలో నిలిచిన ఈ చిత్రం గురించి మేకర్స్‌ స్పందిస్తూ ''ఆస్కార్‌ కోసం పోటీ పడుతున్న సినిమాల్లో 'మనసానమ:'  ఉండడం గర్వకారణం. ఈ అచీవ్‌మెంట్‌ను గౌరవంగా భావిస్తున్నాము. ఆస్కార్‌ కోసం బరిలో ఉన్న అన్ని సినిమాలను దాటుకుని తెలుగు చలనచిత్ర పరిశ్రమలో మొట్టమొదటి ఆస్కార్‌ను సాధిస్తుందని ఆశిస్తున్నాము'' అని అన్నారు.