Feb 23,2021 21:49

అమరావతి బ్యూరో: అసెంబ్లీలో విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా తీర్మానం చేయాలని రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయించింది. ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి అధ్యక్షతన మంగళవారం సచివాలయంలోని మొదటి బ్లాక్‌లో మంత్రిమండలి సమావేశం జరిగింది. ఈ సమావేశంలో విశాఖ ఉక్కు ఫ్టాక్టరీ ప్రైవేటీకరణకు కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం చర్చకు వచ్చింది. ఈ నిర్ణయానికి వ్యతిరేకంగా విశాఖతో రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ఆందోళనలు, ప్రజల మనోభావాలను మంత్రులు వివరించినట్టు తెలిసింది. ముఖ్యమంత్రి ఇప్పటికే కేంద్రానికి లేఖ రాసిన విషయం కూడా చర్చకు వచ్చింది. ఆ లేఖలో పేర్కొన్న విధంగా పూర్తిస్థాయిలో కాకపోయినప్పటికీ ఆ అర్ధం వచ్చేవిధంగానే అసెంబ్లీలో సైతం తీర్మానం చేయాలని మంత్రి మండలి నిర్ణయించినట్టు తెలిసింది. దీనిలో భాగంగా ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూనే దానికి ప్రత్యామ్నాయాల అమలును పరిశీలించాలని కేంద్రాన్ని కోరాలని నిర్ణయించినట్టు సమాచారం. కేబినెట్‌ సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడిన రాష్ట్ర సమాచార శాఖ మంత్రి పేర్ని నాని ప్రైవేటీకరించకుండా ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా ప్రజల ఆస్తి గానే స్టీల్‌ప్లాంటును ఉంచాలని కోరుతూ సిఎం జగన్‌మోహన్‌రెడ్డి ప్రధానికి లేఖ రాసిన విషయాన్ని ప్రస్తావించారు. విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ రక్షణకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. కాకినాడ సెజ్‌ భూముల కు సంబంధించి 2,180 ఎకరాల భూములను తిరిగి రైతులకు ఇవ్వాలని నిర్ణయించినట్టు చెప్పారు.సెజ్‌ ప్రాంతంలోని ఆరు గ్రామాలను ప్రజలు ఖాళీ చేయాల్సిన అవసరం లేదని తెలిపారు. ఈ మేరకు 22(ఎ) నిషేధిత భూముల కింద పెట్టిన భూములకు మినహాయింపులు ఇస్తూ అధికారులకు ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేసినట్లు మంత్రి చెప్పారు. రైతులందరికీ ఇప్పటికే ఇచ్చిన నష్టపరిహారానికి అదనంగా ఎకరాకు రూ.5లక్షలు అదనంగా చెల్లించాలని కేబినెట్‌ నిర్ణయం తీసుకుందన్నారు. కాకినాడ సెజ్‌ భూముల పోరాటంలో రైతులపై పెట్టిన కేసులను ఉపసంహరించుకోవాలని కూడా నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. సుమారు 6లక్షల మంది అగ్రవర్ణ పేదలకు (ఇబిసి నేస్తం పధకం కింద) రూ.670 కోట్లతో ఆర్దిక పరిపుష్టి కింద చేయూతనందించేందుకు మంత్రి మండలి నిర్ణయం తీసుకుందన్నారు. ఈ పధకం మూడేళ్ల పాటు అమల్లో ఉంటుందని, ఏడాదికి ఒక్కో మహిళకు రూ.15వేల వంతున మూడేళ్లకు కలిపి రూ.45వేలు అందించడం జరుగుతుందన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న 23 రకాల సంక్షేమ కార్యక్రమాలతో 5.69కోట్ల మందికి లబ్ది చేకూరుతోందని, ఏ నెలలో ఏ పధకం ప్రజలకు అందాలనే దానికి 2021-22నవరత్నాల అమలు కేలండర్‌ను మంత్రి మండలి ఆమోదించింది.
                                          16 నురచి బడ్జెట్‌ సమావేశాలు
రాష్ట్ర బడ్జెట్‌ సమావేశాలు మార్చి 16నుండి ప్రారంభం కానున్నాయి. ఈ మేరకుమంత్రివర్గ సమావేశంలో నిర్ణయిరచినట్లు తెలిసిరది. మార్చి 31లోగా సుమారు పది నురచి 12 రోజులపాటు ఈ సమావేశాలను నిర్వహిరచాలని భావిస్తున్నట్లు సమాచారం. ఎన్నికల నియమావళి కారణంగా బడ్జెట్‌ నిర్వహిరచాలా, ఓట్‌ ఆన్‌ అక్కౌరట్‌కు వెళ్లాలా అన్న సందిగ్ధత మధ్య మంత్రివర్గంలో జరిగిన చర్చకు ప్రాధాన్యత ఏర్పడిరది. ఈ భేటీలో శాసనసభలో పూర్తిస్థాయి బడ్జెట్‌ ప్రవేశపెట్టి ఆమోదిరపచేసుకునేరదుకే మొగ్గు చూపిరచినట్లు సమాచారర. ఇదే అరశాన్ని మంత్రులకు కూడా స్పష్టం చేసి, ఆ దిశగా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి ఆదేశించారు.