Apr 08,2021 20:02

మాట్లాడుతున్న కె ధనలకీë

ఆశా వర్కర్లను సచివాలయాలకు బదలాయించడం సరికాదు
ప్రజాశక్తి - గూడూరు :ఆశా వర్కర్లను గ్రామ, వార్డు సచివాలయాలకు బదలా యింపు చేసే ప్రక్రియను వెంటనే నిలుపుదల చేయాలని ఎపి ఆశా వర్కర్స్‌ హెల్పర్స్‌ యూనియన్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.ధనలకీë డిమాండ్‌ చేశారు. గురువారం పట్టణలోని సిఐటియు కార్యాల యంలో ఆశావర్కర్స్‌ యూనియన్‌ జిల్లా జనరల్‌ బాడీ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా ధనలకీë మాట్లాడుతూ ఆశా వర్కర్లకు పనిభారాన్ని తగ్గించాలన్నారు. వ్యాక్సినేషన్‌ టార్గెట్‌తో ఆశా వర్కర్లపై జరుగుతున్న ఒత్తిడిని నిలువరించాలన్నారు. మొబైల్స్‌ ఇవ్వకుండానే ఆరోగ్య సమాచారామంతా పంపించాలని ప్రభుత్వం ఒత్తిడి చేయడం సరి కాదన్నారు. మూడేళ్లుగా యూనిఫామ్‌ ఇవ్వలేదన్నారు. యూనిఫాం అలవెన్స్‌ కోవిడ్‌ ప్రత్యేక అలవెన్స్‌ రూ. 6 వేలు వెంటనే ఇవ్వాలన్నారు. జిల్లా కార్యదర్శి దుగ్గిరాల అన్న పూర్ణమ్మ మాట్లాడుతూ ఆశా వర్కర్లకు సంక్షేమ పథకాలు, రిటైర్మెంట్‌ సౌకర్యాలు కల్పించాలని, 10లక్షల గ్రూపు ఇన్సూరెన్స్‌ అమలు చేయాలని కోరారు. ఈ సమావేశంలో యూనియన్‌ జిల్లా అధ్యక్షులు విజయలక్ష్మి , ఆశా వర్కర్లు పాల్గొన్నారు.