Oct 14,2021 18:31

ముంబయి : బాలీవుడ్‌ బాద్‌షాగా పేరుగాంచిన షారూక్‌ ఖాన్‌ కుమారుడు ఆర్యన్‌ ఖాన్‌కు మరోసారి చుక్కెదురైంది. ముంబయిలోని రేవ్‌ పార్టీ, డ్రగ్‌ సంబంధించిన ఘటనలో నార్కోటిక్స్‌ కంట్రోల్‌ బ్యూరో (ఎన్‌సిబి) అధికారులకు దొరికిపోయిన ఏడుగురులో ఆర్యన్‌ ఖాన్‌ ఒకరు. ఆర్యన్‌ ఖాన్‌ బెయిల్‌ పిటిషన్‌పై విచారించిన ప్రత్యేక కోర్టు తీర్పును 20 వరకు రిజర్వ్‌ చేసింది. దీంతో తిరిగి ఆర్యన్‌ జైలుకు తరలించారు. ఆర్యన్‌, అర్భాజ్‌, మూన్‌మూన్‌ ధామేచాల బెయిల్‌ పిటిషన్‌పై ఎన్‌సిబి, నిందితుల తరుపు న్యాయ వాదుల మధ్య వాదనలు జరిగాయి. వీరికి బెయిల్‌ ఇవ్వకూడదని ఎన్‌సిబి తరుపు న్యాయవాది వాదించారు. ఈ వాదనలు విన్న జస్టిస్‌ వివి పాటిల్‌ తీర్పును ఈ నెల 20కు వాయిదా వేశారు.