Apr 14,2021 21:46

అమరావతి బ్యూరో : రాష్ట్ర వ్యాప్తంగా ఆరుగురు డిప్యూటీ కలెక్టర్లను ప్రభుత్వం బదిలీ చేసింది. కొంత కాలంగా పోస్టింగుల కోసం ఎదురు చూస్తున్నవారికి ఈ అవకాశం కల్పించింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్‌ దాస్‌ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. తక్షణమే వారిని రిలీవ్‌ చేయాలని, పోస్టుల్లో చేరిన వెంటనే ప్రభుత్వానికి సమాచారాన్ని తెలియజేయాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.