Feb 25,2021 19:17

ప్రయాణికులను ఆర్‌టిసి బస్సులో ఎక్కిస్తున్న దృశ్యం

ఆర్‌టిసిలో ప్రయాణం సురక్షితం
ప్రజాశక్తి - గూడూరు :ఆర్‌టిసి బస్సుల్లో ప్రయాణం సురక్షితమని గూడూరు ఆర్‌టిసి డిఎం అశోక్‌ కుమార్‌ పేర్కొన్నారు గురువారం తిప్పవరప్పాడు జంక్షన్‌ వద్ద స్పెషల్‌ డ్రైవ్‌ నిర్వహించారు. అధిక లోడుతో వెళ్తున్న ప్రయివేటు వాహనాలు, నిబంధనలకు మించి ప్రయాణాలు సాగిస్తుం డడాన్ని గమనించారు. ప్రయివేటు వాహనాల్లో ప్రయాణం సురక్షితం కాదన్నారు.
ప్రమాదాలు జరిగినా ప్రభుత్వం నుంచి ఎటువంటి నష్టపరిహారం అందే అవకాశముండదన్నారు. ఆర్‌టిసి బస్సులో ప్ర యాణం సురక్షితమని, ప్రజలు ఈ విషయం తెలుసుకొని ఆర్‌టిసిలో బస్సుల్లోనే ప్రయాణించాలన్నారు.సుఖంగా, సురక్షితంగా గమ్య స్థానాలను చేరుకోవాలని కోరారు. అధిక జనాభాతో ఉన్న వాహనాల్లో ప్రయాణికులను దింపేసి ఆర్‌టిసి బస్సుల్లో ఎక్కించారు. ఈ స్పెషల్‌ డ్రైవ్‌లో గూడూరు ఆర్‌టిసి డిఎం అశోక్‌ కుమార్‌తో పాటు పలు యూనియన్ల నాయకులు, ఆర్‌టిసి సిబ్బంది పాల్గొన్నారు.