Feb 01,2021 15:39

గంపలగూడెం(కృష్ణా): ఆర్టిసి బస్సు డీకొని వృద్ధురాలు మృతి చెందిన సంఘటన మండలంలోని నెమలిలో సోమవారం చోటుచేసుకుంది. వివరాల ప్రకారం ఖమ్మం జిల్లా వైరా మండలం ముసలమడుగు గ్రామానికి చెందిన జాగర్లమూడి రాములమ్మ (70) నెమలి వేణుగోపాల స్వామి వారి ఆలయం ముందు రోడ్డు దాటుతుండగా తిరువూరు ఆర్టీసీ డిపోకు చెందిన తిరువూరు - ఉమ్మడి దేవరపల్లి బస్సు తగిలి ఆమె అక్కడికక్కడే మృతిచెందింది. నెమలి లోని తన కూతురు ఇంటికి వచ్చి తిరిగి వెళ్లేందుకు గుడి వద్దకు వచ్చిందని గ్రామస్తులు తెలిపారు. స్థానిక ఎస్‌ఐ విసతీష్‌ అక్కడకు చేరుకుని పంచనామా నిర్వహించి పోస్టుమార్టం నిమిత్తం రాములమ్మ మృతదేహాన్ని తిరువూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కేసు దర్యాప్తులో ఉంది.