Nov 29,2021 13:19

చిత్తూరు : పిచ్చాటూరు మండలంలోని అరణీయార్‌ ప్రాజెక్ట్‌ ను వైసిపి నేతలు సోమవారం సందర్శించారు. నేతలు అరణీయార్‌ ప్రాజెక్టు అధికారులతో మాట్లాడుతూ... ప్రస్తుతం అరణీయార్‌లో నీటి మట్టం 27 అడుగులకు చేరుకుందని అన్నారు. అరణీయార్‌లో నీటి సామర్థ్యాన్ని 29 అడుగులకు పెంచాలని కోరారు. ఈ కార్యక్రమంలో వైసిపి మండల అధ్యక్షుడు హరిచంద్ర రెడ్డి, పిచ్చాటూరు సర్పంచ్‌ కేజీ రోస్‌ రెడ్డి, ఎస్సీ సెల్‌ అధ్యక్షుడు గోవిందన్‌, మురుగా రెడ్డి, వెంకట్‌, ఇస్మాయిల్‌, పెరుమాల్‌ మునిరాజా పాల్గొన్నారు.