Nov 25,2021 20:57

భారత్‌ 258/4
జడేజా, శుభ్‌మన్‌ అర్ధసెంచరీలు

కాన్పూర్‌: అరంగేట్రం టెస్ట్‌మ్యాచ్‌లోనే శ్రేయస్‌ అయ్యర్‌ అదరగొట్టాడు. భారతజట్టు 145 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి కష్టాల్లో ఉన్న దశలో శ్రేయస్‌ అయ్యర్‌ (75బ్యాటింగ్‌), రవీంద్ర జడేజా(50 బ్యాటింగ్‌) కలిసి ఐదో వికెట్‌కు అజేయంగా 113 పరుగులు జోడించారు. వీరిద్దరి సెంచరీ భాగస్వామ్యంతో టీమిండియా తొలి ఇన్నింగ్స్‌లో నిలదొక్కుకోగలిగింది. టాస్‌ గెలిచిన ఇండియా తొలిగా బ్యాటింగ్‌కు దిగింది. ఓపెనర్‌ అగర్వాల్‌ 13 మరోసారి నిరాశపర్చగా.. శుభ్‌మన్‌ గిల్‌(52) అర్ధసెంచరీతో మెరిసాడు. టెస్ట్‌ స్పెషలిస్ట్‌ ఛటేశ్వర పుజారా(26), కెప్టెన్‌ రహానే(35) నిరాశపరిచినా.. చివరి సెషన్‌లో శ్రేయస్‌, జడేజా కలిసి కివీస్‌ బౌలర్లపై సంపూర్ణ ఆధిపత్యం చెలాయించారు. ఈ క్రమంలో రవీంద్ర జడేజా టెస్టుల్లో 17వ అర్ధసెంచరీని పూర్తి చేసుకున్నాడు. దీంతో టీమిండియా తొలి రోజు ఆట ముగిసే సమయానికి నాలుగు వికెట్లు కోల్పోయి 258 పరుగులు చేసింది. వెలుతురు సరిగా లేని కారణంగా తొలిరోజు 84 ఓవరు ఆట మాత్రమే కొనసాగింది. తొలిరోజు ఆట ముగిసే సమయానికి క్రీజ్‌లో అయ్యర్‌(75), జడేజా(50) ఉన్నారు. న్యూజిలాండ్‌ బౌలర్లలో కైల్‌ జేమిసన్‌ మూడు వికెట్లు తీసుకోగా.. సౌథీ ఖాతాలో ఒక వికెట్‌ చేరింది.
స్కోర్‌బోర్డు..
భారత్‌ తొలి ఇన్నింగ్స్‌: అగర్వాల్‌ (సి)బ్లండెల్‌ (బి)జేమీసన్‌ 13, శుభ్‌మన్‌ (బి)జేమీసన్‌ 52, పుజరా (సి)బ్లండెల్‌ (బి)సౌథీ 26, రహానే (బి)జేమీసన్‌ 35, శ్రేయస్‌ (బ్యాటింగ్‌) 75, జడేజా (బ్యాటింగ్‌) 50, అదనం 7. (84 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి) 258 పరుగులు.
వికెట్ల పతనం: 1/21, 2/82, 3/106, 4/145
బౌలింగ్‌: సౌథీ 16.4-3-43-1, జేమీసన్‌ 15.2-6-47-3, అజాజ్‌ పటేల్‌ 21-6-78-0, సోమర్‌వెల్లా 24-2-60-0, రచిన్‌ రవీంద్ర 7-1-28-0