Dec 03,2021 20:46

తిరువనంతపురం: పెరింగరలో సిపిఐ(ఎం) యువ నేత సందీప్‌ హత్య బిజెపి-ఆరెస్సెస్‌ ముఠా పనేనని మార్క్సిస్టు పార్టీ కేరళ రాష్ట్ర కార్యదర్శి కొడియేరి బాలకృష్ణన్‌ అన్నారు. ఆరెస్సెస్‌ ఒక పథకం ప్రకారమే ఈ హత్యాకాండ సాగిస్తోంది. 2016లో ఎల్‌డిఎఫ్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకు 20 మంది పార్టీ కార్యకర్తలు హత్యకు గురయ్యారు. వీరిలో 15 మంది బిజెపిాఆరెస్సెస్‌ ఘాతుకాలకు బలైనవారే. అంతకు ముందు 215 మంది సిపిఎం కార్యకర్తలను ఆరెస్సెస్‌ అమానుషంగా పొట్టనబెట్టుకుంది. ఇతర రాజకీయ ప్రత్యర్థులు సాగించిన హింసాకాండలో 588 మంది వరకు పార్టీ కార్యకర్తలు చనిపోయారని కొడియేరి వివరించారు. మైనార్టీలు, ఎస్సీ, ఎస్టీలపై హింసకు వ్యతిరేకంగా డిసెంబరు 7న దేశవ్యాపితంగా తలపెట్టిన నిరసనల్లో భాగంగా కేరళలో అన్ని జిల్లా కేంద్రాలు, ఏరియాసెంటర్లలో ఆందోళనలు నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు.
సిపిఐ(ఎం) కేరళ రాష్ట్ర కార్యదర్శిగా తిరిగి బాధ్యతలు చేపట్టిన కొడియేరి
సిపిఐ(ఎం) పొలిట్‌బ్యూరో సభ్యులు కొడియేరి బాలకృష్ణన్‌ శుక్రవారం తిరిగి బాధ్యతలు చేపట్టారు. ఆరోగ్య కారణాల రీత్యా గత సంవత్సరం నవంబరులో ఏడాది పాటు బాలకృష్ణన్‌ మెడికల్‌ లీవ్‌ తీసుకోవడంతో ఆ బాధ్యతలను పార్టీ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు ఎ విజయరాఘవన్‌కు తాత్కాలికంగా అప్పగించారు. మెడికల్‌ లీవ్‌ పూర్తి కావడంతో బాలకృష్ణన్‌ తిరిగి బాధ్యతలు స్వీరించారు. పార్టీ రాష్ట్ర కార్యదర్శిగా 2015లో మొదటిసారి ఎన్నికైన ఆయన , 2018లో రెండవ సారి తిరిగి ఎన్నికయ్యారు.