Nov 26,2021 07:12

న్యూఢిల్లీ : రాజ్యసభ మాజీ సభ్యులు, ఆర్‌ఎస్‌పి నేత, ఆ పార్టీ కేంద్ర కమిటీ సభ్యులు అబని రాయ్  గురువారం ఉదయం 10.30 గంటలకు కన్నుమూశారు. 82 సంవత్సరాల అబని రాయ్ దీర్ఘకాలంగా వయో సంబంధిత అనారోగ్యంతో బాధపడుతున్నారు. అబని రారు 1996 నుంచి 2011 వరకూ పశ్చిమ బెంగాల్‌ నుంచి రాజ్యసభకు ఎన్నికయ్యారు. కేంద్రంలో పర్యాటక, రవాణా, కార్మిక, ఆర్థిక వంటి అనేక కీలక మంత్రిత్వ శాఖలకు చెందిన సలహా కమిటీల్లో సభ్యునిగా పనిచేశారు. 1995లో కొల్‌కత్తా కార్పొరేషన్‌ కౌన్సిలర్‌గానూ ఎన్నికయ్యారు. 1959లో ఆర్‌ఎస్‌పిలో రారు చేరారు. రారు మృతిపై ఆర్‌ఎస్‌పి ప్రధాన కార్యదర్శి మనోజ్‌ భట్టాచార్య తీవ్ర విచారం వ్యక్తం చేశారు.