Feb 11,2021 23:21

నిరసన తెలుపుతున్న కార్మికులు, ఉద్యోగులు

ప్రజాశక్తి - నంద్యాల: ఆర్‌ఎఆర్‌ఎస్‌ భూముల్లో వైద్య కళాశాల ఏర్పాటు చేసి సంస్థ చరిత్రను నాశనం చేయొద్దని సిఐటియు నాయకులు పేర్కొన్నారు. సిఐటియు ఆధ్వర్యంలో ఆర్‌ఎఆర్‌ఎస్‌ కార్మికులు, ఉద్యోగులు చేపట్టిన పోరాటం గురువారం 89వ రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ 115 సంవత్సరాల చరిత్ర కలిగి, నంద్యాలను ప్రపంచ స్థాయిలో నిలబెట్టడంలో అనేక మంది శాస్త్రవేత్తల, ఉద్యోగుల, కార్మికుల కషి ఉందన్నారు. అయితే వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అభివద్ధి పేరుతో ఇప్పటికే అభివద్ధి చెందిన వాటిని నాశనం చేసి వైద్యకళాశాల నిర్మించాలని అనుకోవడం సరైందికాదని అన్నారు. ప్రభుత్వం విడుదల చేసిన జీవో నెంబర్‌ 341 వెంటనే రద్దు చేసి, ఇతర ప్రైవేటు భూములు కొనుగోలు చేసేందుకు 200 కోట్ల నిధులు కేటాయించాలని లేదా ప్రభుత్వ భూములు నంద్యాల చుట్టుపక్కల ప్రాంతాల్లో వందలాది ఎకరాలు ఖాళీ స్థలాలు ఉన్నాయని వాటిని సేకరించి అక్కడ వైద్యకళాశాల నిర్మిస్తే నంద్యాల మరింత అభివద్ధి చెందే అవకాశం ఉందని అన్నారు. సిఐటియు కోశాధికారి వెంకటలింగం, ఆర్‌ఏఆర్‌ఎస్‌ యూనియన్‌ నాయకులు ఎ.వి.రమణ, ఖాదర్‌ వలి, గోపాల్‌, ఎల్లమ్మ, పుల్లయ్య, నాగేశ్వరమ్మ, అయ్యన్న, మైమున్నీసాతోపాటు కార్మికులు, ఉద్యోగులు పాల్గొన్నారు.