కళ్లు, చెవులు, నోరు మూసుకుని నిరసన
ప్రజాశక్తి - నంద్యాల: ఆర్ఎఆర్ఎస్ భూములను కాపాడాలని, మెడికల్ కళాశాల కోసం భూములను కేటాయిస్తూ విడుదల చేసిన జిఒ 341ని రద్దు చేయాలని శుక్రవారం కళ్లు, చెవులు, నోరు మూసుకుని నిరసన చేపట్టారు. ఆర్ఎఆర్ఎస్ యూనియన్ కార్యదర్శి ఎవి.రమణ అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా సిఐటియు పట్టణ అధ్యక్షులు లక్ష్మణ్, కార్మికులు రమణ, ఖాదర్ వలీ, అయ్యన్న, పుల్లయ్య, ఖాదర్ వలీ, అయ్యన్న, మురళీ, రఘు, వినరు, మల్లికార్జున మాట్లాడారు. ఆర్ఎఆర్ఎస్ భూములను వైద్య కళాశాల పేరుతో తీసుకోవద్దని శాస్త్రవేత్తలు, కార్మికులు, ఉద్యోగులు కోరుతున్నారని తెలిపారు. ఇన్ని రోజులుగా ఆందోళన చేస్తున్నా నంద్యాల ఎంపీ, ఎమ్మెల్యేలు పట్టించుకోవడం లేదని విమర్శించారు. ముఖ్యమంత్రి జగన్ కార్మికుల, రైతుల శ్రేయస్సు ధ్యేయమని మాయ మాటలు చెప్పి నేడు నోరు మెదపడం లేదని తెలిపారు. సుజాత, రాజేశ్వరి, మైమూన్, ఎల్లమ్మ, 100 మంది ఉద్యోగులు, కార్మికులు పాల్గొన్నారు.
నిరసన తెలుపుతున్న యూనియన్ నాయకులు