Nov 30,2020 21:10

కమిషనర్‌కి వినతిపత్రం ఇస్తున్న సిఐటియు


కమిషనర్‌కి సిఐటియు వినతి

ప్రజాశక్తి -పుంగనూరు : మున్సిపల్‌ చట్టాలను సవరిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జారీచేసిన 16 నెంబర్‌ ఆర్డినెన్స్‌ ప్రజలపై ఆస్థి పన్నులు, నీటి చార్జీలు, డ్రైనేజీ చార్జీలను భారీగా పెంచే 196, 197, 198 జీవోలను తక్షణమే ఉపసంహరించుకోవాలని సిఐటియు ఆధ్వర్యంలో సోమవారం పుంగనూరు మున్సిపల్‌ కమిషనర్‌ కే ఎల్‌ వర్మకి వినతిపత్రం ఇచ్చారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా అధ్యక్షుడు వాడ గంగరాజు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ ఆదేశాలకు తలవొగ్గి రాష్ట్ర ప్రభుత్వం ఆస్తి విలువ ఆధారంగా ఆస్తి పన్ను (ఇంటి పన్ను) విధించే రీతిలో చట్టాలను సవరించిందని, దీనివలన నగర పంచాయతీలలో అనేక రెట్లు ఇంటి పనులు పెరుగుతాయని అంతేకాకుండా ప్రతి సంవత్సరం భూముల విలువలు పెరుగుదలతో పాటు ఇంటి పన్ను పెరుగుతాయన్నారు. మంచినీరు, డ్రైనేజీచార్జీలను, చెత్తపనులను, యూసర్‌ చార్జీలను పౌర సదుపాయాల నిర్వహణకు అయ్యే ఖర్చు మొత్తం ప్రజల నుండి రాబట్టే రీతిలో ఆదేశాలు జారీ చేశారు. దీంతో పౌర సదుపాయాలు వ్యాపార సరుకులుగా మారిపోతాయి.చింతపండు కార్మికులు యూనియన్‌ నాయకురాలు ధనలక్ష్మి, సిఐటియు రమణ, మురళి పాల్గొన్నారు.