Apr 14,2021 20:24

మలయాళ నటుడు మోహన్‌ లాల్‌ నటిస్తున్న చిత్రం 'ఆరాట్టు'. తాజాగా ఈ చిత్రం నుంచి టీజర్‌ను చిత్రబృందం విడుదల చేసింది. 53 సెకన్ల నిడివి ఉన్న వోల్టేజ్‌ మాస్‌ కంటెంట్‌ టీజర్‌తో హీరోను పరిచయం చేశారు. అయితే ఈ టీజర్లో ఒకే ఒక్క డైలాగ్‌ ఉండగా, అది కూడా తెలుగు డైలాగ్‌ కావడం విశేషం. 'నేను వాడిని చంపేస్తాను' అంటూ విలన్‌ను హెచ్చరించారు మోహన్‌లాల్‌. దీంతో సినిమాలో తెలుగు నేపథ్యం కలిగిన విలన్‌ పాత్ర ఉంటుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఫుల్‌ మాస్‌ ఎంటట్‌టైనర్‌ 'ఆరాట్టు' చిత్రానికి బి.ఉన్నికష్ణన్‌ దర్శకత్వం వహించారు.