Oct 27,2021 11:05

కాబూల్‌ : ఆఫ్ఘనిస్తాన్‌లోని తాలిబన్‌ పాలనలో తమ కమ్యూనిటీకి చెందిన 700 మందికి పైగా సభ్యులు ప్రమాదంలో ఉన్నారని అంతర్జాతీయ ఒలింపిక్‌ కమిటీ (ఐఒసి)మంగళవారం తెలిపింది. సెప్టెంబర్‌లో ఐఒసి ప్రెసిడెంట్‌ థామస్‌బాచ్‌ మాట్లాడుతూ... టోక్యో క్రీడల అథ్లెట్లు.. అలాగే 2022 వింటర్‌కు ఒలింపిక్స్‌కు అర్హత సాధించాలని ఎంతో ఆశతో ఉన్న ఇద్దరు క్రీడాకారులు దేశాన్ని విడిచిపెట్టారని తెలిపారు. ఆగస్టు 15న అమెరికా బలగాలను ఉపసంహరించుకున్న తర్వాత... ఆఫ్ఘనిస్తాన్‌లో గత నెలలో తాలిబన్ల పాలన మొదలైంది. తాము క్రీడల్లో పాల్గంటున్న మహిళలు, బాలికలను, వారికి మద్దతునిస్తున్నవారిని ప్రోత్సహిస్తున్నామని తెలిపింది. ఆఫ్ఘన్‌ ఒలింపిక్‌ సంఘంలోని సభ్యులకు ఐఒసి రెండు రకాలుగా సాయాన్ని కొనసాగిస్తామని పేర్కొంది. మొదట, వారిని సురక్షిత దేశాలకు తరలించేందుకు ప్రయత్నాలు చేపట్టం, ఇక రెండవది.. ఆహారం, దుస్తుల లభ్యతకు సంబంధించి సంక్షోభంతో చాలా మంది ఇబ్బందులకు ఎదుర్కొంటున్నారని ఐఒసికి సమాచారం అందిందని, ఆ దిశగా సహాయ చర్యలు చేపడుతున్నట్లు తెలిపింది. ఈ రెండు విషయాల్లో కతార్‌ నేషనల్‌ ఒలింపిక్‌ కమిటీ సాయం అందించిందని పేర్కొంది.