
కాబూల్ (అఫ్గాన్) : అఫ్గానిస్తాన్‌లో తాలిబన్లు మరోసారి తీవ్ర రక్తపాతాన్ని సృష్టించారు. ఆదివారం ఆత్మాహుతి కారు బాంబును పేల్చారు. ఈ పేలుడు స్థానిక ఆర్మీ బేస్ ప్రాంతంలో జరగడంతో సుమారు 26 మంది ప్రాణాలు కోల్పోయినట్ల సమాచారం. బామియన్‌లో రెండు బాంబు పేలుళ్ల ఘటనలు మరవక ముందే ఈరోజు ఘాజీలో ఆత్మాహుతి కారు బాంబు దాడి జరిగింది. ఖతార్ రాజధాని దోహాలో గత సెప్టెంబర్ 12 న జరిగిన శాంతి చర్చల అనంతరం అఫ్గానిస్తాన్‌లో జరిగిన అతి పెద్ద బాంబు పేలుడు దాడి ఇదే.
తరచూ తాలిబన్లు, ప్రభుత్వ బలగాల మధ్య దాడులు జరిగే ఘాజీ నగర శివారు ప్రాంతంలో ఉన్న తూర్పు ప్రావిన్స్‌లో కారు బాంబు పేలుడు సంభవించింది. స్థానిక ఘాజీ ఆస్పత్రి డైరెక్టర్ బాజ్ మహ్మద్ హేమత్ మాట్లాడుతూ.. ' ఈ దాడిలో ఇప్పటివరకు 26 మఅతదేహాలను గుర్తించాము. మరో 17 మంది తీవ్రంగా గాయపడ్డారు. వారంతా ప్రభుత్వ భద్రతా సిబ్బంది ' అని తెలిపారు.
ఈ దాడిలో మఅతులకు సంబంధించిన సంఖ్యను ఘాజీ ప్రావిన్స్ కౌన్సిల్ సభ్యుడు నాసిర్ అహ్మద్ వెల్లడించారు. అంతర్గత వ్యవహారాల శాఖ ప్రతినిధి తారిక్ అరియన్ వాహనాన్ని పేలుడు పదార్ధాలతో పేల్చివేశారు.