Nov 27,2020 19:39

గౌహతి : భారత పార్లమెంట్‌ నుంచి అనర్హతకు గురైన తొలి సభ్యుడుగా గుర్తింపు ఉన్న లాల్డుహోమా తాజాగా మిజోరం ఎమ్మెల్యేగానూ అనర్హత వేటుకు గురయ్యారు. సెర్చిప్‌ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్ధిగా ఎన్నికైనప్పటికీ లాల్డుహోమా తనను జోరామ్‌ పీపుల్స్‌ మూమెంట్‌ (జెపిఎం) ప్రతినిధిగా ప్రకటించుకోవడంతో అనర్హత వేటు పడింది. 'డిక్లరేషన్‌ కారణంగా అతను స్వతంత్ర శాసనసభ్యుడి పాత్రను కోల్పోయారు' అని స్పీకర్‌ సైలో శుక్రవారం ప్రకటించారు.
1988లో కాంగ్రెస్‌ (ఐ) సభ్యత్వాన్ని వదులుకున్నందుకు ఫిరాయింపులు నిరోధక చట్టం ప్రకారం అనర్హులుగా ప్రకటించిన మొదటి ఎంపిగా లాల్డుహోమా నిలిచారు. 71 ఏళ్ల లాల్డుహోమా మాజీ ఐపిఎస్‌ అధికారి. మాజీ ప్రధాని ఇందిరా గాంధీ సెక్యూరిటీ చీఫ్‌గానూ లాల్డుహోమా పనిచేశారు.