Nov 24,2021 18:13

అనగనగా సిరిపురం అనే ఊరు ఉండేది. ఆ ఊరిలో ఉంటున్న శివయ్యకి ఏడు మేకలు ఉండేవి. అతడు మేకలను మేపుతూ ఉండేవాడు. ఒక రోజు మేకలతో తిరిగి తిరిగి అలసిపోయి ఒక చెట్టు కింద నిద్రపోయాడు. ఒక మేక దారి తప్పి అడవి దగ్గరలోని ఒక చెరువు దగ్గరకి వెళ్లింది. చెరువులో నీరు తాగడానికి వెళ్లింది.

మేకను చెరువు పక్కన చెట్టు దగ్గర ఉన్న సింహం చూసింది. ఈ రోజు తనకు ఆహారం దొరికిందనుకుంది. మేకపై దూకింది. మేక తప్పించుకోబోయింది. కానీ మేక వెనుక కాలు సింహానికి దొరికింది. అప్పుడు మేకకు ఏం చేయాలో అర్థం కాలేదు. అంతలోనే మేకకు ఒక ఉపాయం తట్టింది. అప్పుడు ఆ మేక అరవకుండా, ఏడ్వకుండా నవ్వసాగింది. మేక ఎందుకు నవ్వుతుందో సింహానికి అర్థం కాలేదు.
'పిచ్చి మేకా! నువ్వు ఎందుకు నవ్వుతున్నావ్‌?'' అని ప్రశ్నించింది.

''నా కాలులో ముల్లు ఉంది. కొరికితే నీ గొంతులో దిగుతుంది'' అంది మేక.

సింహం వెంటనే మేక కాలును విడిచి పెట్టి గొంతు పట్టుకోబోయింది. కాలు విడిచిన వెంటనే, సింహానికి దొరకకుండా పరుగు తీసింది మేక.

తన తెలివితేటలతో ఆపద నుంచి బయట పడి, అడవిలో దారి వెతుక్కుని తన స్నేహితుల గుంపులో చేరింది. సమయస్ఫూర్తితో సింహం నుంచి ప్రాణాలను దక్కించుకున్న మేకని దాని మిత్రులు ప్రశంసించాయి.

- విస్లావత్‌ సావిత్రి, 10వ తరగతి,
70132 64464