Jul 31,2021 07:06

ప్రజాశక్తి - యంత్రాంగం : రాష్ట్రంలో మున్సిపల్‌ కార్పొరేషన్లకు రెండో డిప్యూటీ మేయర్‌, మున్సిపాలిటీల్లో వైస్‌ చైర్మన్‌/వైస్‌ చైర్‌పర్సన్‌ ఎన్నికను శుక్రవారం నిర్వహించారు. నగరపాలక సంస్థల్లో రెండో డిప్యూటీ మేయర్‌, పురపాలక సంఘాల్లో రెండో వైస్‌ చైర్‌పర్సన్‌ పదవులకు అవకాశం కల్పిస్తూ ప్రభుత్వం కొన్ని నెలల కిందట నిర్ణయం తీసుకుంది. అనంతపురం జిల్లా తాడిపత్రిలో రెండవ వైస్‌ చైర్మన్‌ ఎన్నిక కార్యక్రమాన్ని వైసిపి బహిష్కరించింది. తాడిపత్రి పట్టణంలో ప్రభుత్వ స్థలాల ఆక్రమణకు మున్సిపల్‌ పాలకవర్గం సహకరించడాన్ని నిరసిస్తూనే తాము ఎన్నికను బహిష్కరించినట్లు ఆ పార్టీ నాయకులు ప్రకటించారు. రెండవ వైస్‌ చైర్మన్‌గా టిడిపి బలపరిచిన స్వతంత్ర అభ్యర్థి అబ్ధుల్‌ రహీం ఎన్నిక అయ్యారు.
కర్నూలు - అరుణ
విజయనగరం- కోలగట్ల శ్రావణి
అనంతపురం - కోగటం విజయభాస్కర్‌రెడ్డి
కడప - బి.నిత్యానందరెడ్డి
తిరుపతి - భూమన అభినయరెడ్డి
చిత్తూరు - రాజేష్‌కుమార్‌రెడ్డి
విజయవాడ - అవుతు శైలజ
మచిలీపట్నం - లంక సూరిబాబు
విశాఖపట్నం - కట్టుమూరి సతీష్‌
గుంటూరు - షేక్‌ సజీల
ఒంగోలు- మాధవరావు

                                                           ఏలూరు మేయర్‌గా నూర్జహాన్‌
     పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు కార్పొరేషన్‌ పాలకవర్గం శుక్రవారం కొలువుదీరింది. మేయర్‌గా షేక్‌ నూర్జహాన్‌ పెదబాబు, డిప్యూటీ మేయర్లుగా గుడిదేశి శ్రీనివాస్‌,నూకపెయ్యి సుధీర్‌బాబు ఏక్రగీవంగా ఎన్నికయ్యారు. ఎన్నికైన కార్పొరేటర్లతో జిల్లా కలెక్టర్‌ ప్రమాణ స్వీకారం చేయించారు. మేయర్‌, డిప్యూటీ మేయర్‌లను, కార్పొరేటర్లను డిప్యూటీ సీఎం ఆళ్ల నాని, ఎమ్మెల్సీ షేక్‌ సాబ్జీ, తదితరులు అభినందించారు.