Oct 28,2021 15:55

అమరావతి : న్యాయమూర్తులపై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్న పంచ్‌ ప్రభాకర్‌ కేసులో... సీబీఐ తీరుపై ఏపీ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. పంచ్‌ ప్రభాకర్‌ వ్యవహారంపై కోర్టు సీరియస్‌ అయింది. ప్రభాకర్‌ను ఎందుకు అరెస్ట్‌ చేయలేకపోతున్నారంటూ సీబీఐని నిలదీసింది. స్టాండింగ్‌ కౌన్సిల్‌ అశ్విని కుమార్‌ వాదనలు వినిపిస్తూ ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా సీబీఐ పట్టించుకోలేదంటూ హైకోర్టుకు విన్నవించారు. కనీసం నోటీసు కూడా ఇవ్వలేకపోయారని స్టాండింగ్‌ కౌన్సిల్‌ తెలిపింది. సోషల్‌ మీడియా ప్లాట్‌ ఫామ్‌లకు నోటీసులు ఇవ్వాలని, ప్రభాకర్‌ వీడియోలు తొలగించేలా ఆదేశాలివ్వాలని న్యాయవాది కోరారు. హైకోర్టు నుంచి సీబీఐకి లేఖ రాయాలని ధర్మాసనం ఆదేశించింది.