Sep 15,2021 22:28

అమరావతి : ఉపాధి హామీ బిల్లుల చెల్లింపు బకాయిల కేసుల్లో తమ ఆదేశాలను అమలు చేయకపోవడంతో ఈ నెల 24న స్వయంగా విచారణకు హాజరై వివరణ ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్‌ దాస్‌ను హైకోర్టు ఆదేశించింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్‌ బి.దేవానంద్‌ ఉత్తర్వులు జారీ చేశారు. ఉపాధి పనుల అక్రమాలపై విజిలెన్స్‌ విచారణ పూర్తయ్యిందో? లేదో? చెప్పాలంది. విజిలెన్స్‌ విచారణ పూర్తయినట్లు కేంద్రానికి రాష్ట్రం గతేడాది అక్టోబరులో చెప్పిందని, ఈ మేరకు కేంద్రం అఫిడవిట్‌ వేసిందని హైకోర్టు గుర్తు చేసింది. ఇంకా విచారణ జరుగుతోందని రాష్ట్రం ఎందుకు చెబుతోందని ప్రశ్నించింది.