Jan 14,2021 12:30

పెరవలి (పశ్చిమ గోదావరి) : అనుమానంతో మద్యం మత్తులో భార్యను భర్త హతమార్చిన ఘటన గురువారం పెరవలిలో వెలుగు చూసింది. పెరవలి మండలం కాపవరం గ్రామంలో జక్కంశెట్టి శ్రీను తన భార్య జక్కంశెట్టి దానమ్మ (48) పై అనుమానంతో మద్యం మత్తులో విచక్షణారహితంగా కత్తితో నరికి హత్య చేశాడు. దానమ్మ తీవ్రగాయలతో అక్కడికక్కడే మృతి చెందింది. నిందితుడు శ్రీను పరారయ్యాడు. ఘటనా స్థలానికి పోలీసులు చేరుకున్నారు. కొవ్వూరు డిఎస్‌పి, బి.శ్రీనాథ్‌, తణుకు సిఐ, చైతన్య క్రిష్ణ, పెరవలి ఎస్‌ఐ, ఎం.సూర్యభగవాన్‌, పోలీసు సిబ్బంది విచారణ చేపడుతున్నారు. మహిళ మృతదేహాన్ని పోస్టుమార్టంకు తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.