Jun 11,2021 15:51

సిరిసిల్ల : భార్యపై అనుమానం పెంచుకున్న ఓ తాగుబోతు భర్త దారుణానికి ఒడిగట్టాడు. మద్యం మత్తులో గొడవకు దిగిన భర్త కోపంతో ఊగిపోతూ రోకలిబండతో బాది భార్యను హతమార్చాడు. ఈ సంఘటన రాజన్న సిరిసిల్ల జిల్లాలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం జవారిపేట గ్రామానికి చెందిన భార్యాభర్తలు నిత్యం గొడవపడేవారు. తాగుడుకు బానిసైన భర్త మద్యం మత్తులో ఇంటికి వచ్చి భార్యను వేధించేవాడు. ఇది చాలదన్నట్లు ఈ మధ్య భార్యపై అనుమానాన్ని పెంచుకున్నాడు. దీంతో నిత్యం దుర్భాషలాడుతూ భార్యను చిత్ర హింసలకు గురిచేసేవాడు. ఈ క్రమంలోనే గురువారం రాత్రి కూడా మద్యం మత్తులో ఇంటికి వచ్చి భార్యతో గొడవ పడ్డాడు. అర్ధరాత్రి వరకు సాగిన ఈ గొడవలో కోపంతో రగిలిపోయిన భర్త భార్యను రోకలిబండతో కొట్టడంతో ఆమె అక్కడికక్కడే మృతిచెందింది.