Feb 13,2021 11:04

న్యూఢిల్లీ : అసమ్మతి, నిరసనలను వ్యక్తం చేసే హక్కు కొంత పరిధి మేరకే వర్తిస్తుందని, ఇది అన్ని వేళలా, అంతటా వర్తించదని సుప్రీంకోర్టు పేర్కొంది. పౌరసత్వ సవరణ చట్టాన్ని వ్యతిరేకిస్తూ 2019లో షాహీన్‌ భాగ్‌ వద్ద చేపట్టిన ఆందోళనలు చట్టవిరుద్ధమని గత సంవత్సరం సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై 12 మంది కార్యకర్తలు దాఖలు చేసిన సమీక్ష పిటిషన్‌ అత్యున్నత న్యాయస్థానం తోసిపుచ్చింది. నిరసనలు తెలిపే హక్కు అన్నివేళ్లలా, అంతటా చెల్లదని పేర్కొంది. కొన్ని సార్లు ఆకస్మిక నిరసనలు చేపట్టవచ్చునని, కానీ..ఇతర హక్కులను ప్రభావితం చేసేలా బహిరంగ ప్రదేశంలో ఆందోళనలు చేపట్టడం సరికాదని జస్టిస్‌ ఎస్‌కె కౌల్‌, అనిరుద్ధ బోస్‌, కృష్ణ మురారీ నేతృత్వంలోని ధర్మాసనం పేర్కొంది. బహిరంగ ప్రదేశాల్లో నిరసనలు చేపట్టరాదని, నిర్ధేశించిన ప్రాంతాల్లో నిర్వహించుకోవచ్చుచని పునురుద్ఘాటించింది.