ప్రజాశక్తి - శిరివెళ్ల: కార్తీక మాసంలో పౌర్ణమి రోజున అన్నదానం నిర్వహించడం ఆత్మ సంతృప్తిని ఇచ్చిందని విజరు మెన్స్ క్లాత్ స్టోర్ అధినేత, అయ్యప్ప స్వామి మాల దీక్ష దారులు పాశం విజరు పేర్కొన్నారు. సోమవారం మండలంలోని ఎర్రగుంట్ల గ్రామంలో శ్రీకృష్ణ మందిరంలో పాశం రమణయ్య, తలారి మురళితో కలసి విజరులు భక్తులకు అన్నదానం నిర్వహించారు. కార్యక్రమంలో అయ్యప్ప స్వాములు, కృష్ణ మందిరం కమిటీ సభ్యులు, భక్తులు పాల్గొన్నారు.
మిడుతూరు : కార్తీక పౌర్ణమి సందర్భంగా వై.పాలెం గ్రామంలో శ్రీ రామకృష్ణ ఆశ్రమం వద్ద అన్నదాన కార్యక్రమం, మండల కేంద్రంలోని శివాలయం వద్ద, వాటర్‌షెడ్ వద్ద అన్నదాన కార్యక్రమాలు నిర్వహించారు.
అన్నదానం చేస్తున్న పాశం విజరు