Nov 30,2020 19:40

అన్నదానం నిమిత్తం విరాళం అందజేస్తున్న దాత సుబ్బరాజు

ప్రజాశక్తి - కాళ్ల
కాళ్లకూరులోని వెంకటేశ్వరస్వామి దేవస్థానంలో అన్నదానం నిమిత్తం అల్లూరి సుబ్బరాజు విరాళం అందజేశారు. భీమవరానికి చెందిన అల్లూరి వెంకటరాజు, వెంకట నరసమ్మ జ్ఞాపకార్థం వారి కుమారుడు అల్లూరి సుబ్బరాజు అన్నదానం నిమిత్తం లక్షా 11 వేల నూట పదకొండు రూపాయలు విరాళంగా సోమవారం అందజేశారు. స్వామివారి దర్శనానంతరం దేవస్థానం తరపున అర్చకులు ఆశీర్వచనం తీసుకున్నారు. కార్యనిర్వహణాధికారి ముదునూరి సత్యనారాయణ రాజు స్వామివారి శేషవస్త్రం, ప్రసాదం అందజేశారు.