
అన్నదాన సత్రాన్ని ప్రారంభిస్తున్న మాజీ ఎమ్మెల్యే బూచేపల్లి
చీమకుర్తి : గుంటిగంగలో నూతనంగా నిర్మించిన గుంటిగంగా భవానీ బ్రాహ్మణ అన్నదాన సత్రాన్ని మాజీ ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాదరెడ్డి, లయన్స్క్లబ్ వ్యవస్థాపక అధ్యక్షులు డాక్టర్ జవహర్ ఆదివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజల సౌకర్యార్ధం అన్నదాన సత్రాలు ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య సంఘం జిల్లా మాజీ అధ్యక్షులు చలువాది బదరీనారాయణ, ఎల్లాప్రగడ కన్నయ్య, శ్యామల, యేల్చూరి రామ కోటేశ్వరావు, త్రిపురారిబొట్ల శ్రీనివాసమూర్తి, నరసింహారావు, ఆర్వి. నరసింహారావు, మోహనరావు,కమిటీ అధ్యక్షులు వైటి లక్ష్మిసుందరి, ఉపాధ్యక్షులు కోటేశ్వరరావు, కార్యదర్శి ఫణిచంద్రశేఖర్, సీతారామదీక్షితులు, మూర్తి, సుబ్బరామయ్య, వెంకటేశ్వరి పాల్గొన్నారు.