Nov 17,2020 14:33

న్యూఢిల్లీ:  గత నెలలో వన్ ప్లస్ 8టి స్మార్ట్ ఫోన్ ని ఆవిష్కరించిన వన్ ప్లస్ సంస్థ నుండి రాబోయే ఫ్లాగ్ షిప్ మొబైలుపై ఆన్ లైన్ లో చర్చలు జోరుగా నడుస్తున్నాయి.  2021  మార్చిలో ‘వన్ ప్లస్ 9’ ఫ్లాగ్ షిప్ మొబైల్ ను తీసుకొస్తున్నారన్న వార్త ఆన్‌లైన్‌లో హల్ చల్ చేస్తోంది.  దీనికి సంబంధించి తెలుస్తున్న సమాచారం ప్రకారం...  రాబోయే వన్ ప్లస్ 9 స్మార్ట్ ఫోన్ డిజైన్... ‘వన్ ప్లస్ 8టి’ మాదిరిగానే వుంటుందని తెలుస్తోంది. వన్ ప్లస్ 8టి స్మార్ట్ ఫోన్ లో మాదిరిగానే సెల్ఫీ కెమెరా, ప్రధాన కెమెరా ఫీచర్లు  వన్ ప్లస్ 9 స్మార్ట్ ఫోన్ లో కూడా ఉన్నట్లు సమాచారం. అయితే, ఈ మొబైల్ 6.55-ఇంచ్ ప్యానెల్ తో పాటు,  144హెచ్ జడ్ అధిక రిఫ్రెష్ రేట్ తో రాబోతుంది.  దీర్ఘచతురస్రాకార కెమెరా మాడ్యూల్‌లో 3 సెన్సార్లు,  ఎల్‌ఈడీ ఫ్లాష్ ఉంటాయి. అయితే, రెండు సెన్సార్లు మూడవ దాని కంటే పెద్దగా ఉంటాయి. ఈ సిరీస్‌లో వన్‌ప్లస్ 9,  వన్‌ప్లస్ 9 ప్రో వేరియెంట్లలో వన్‌ప్లస్ 9 సిరీస్‌లో క్వాల్‌కామ్ రాబోయే స్నాప్‌డ్రాగన్ 875 చిప్, 65డబ్ల్యూ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంటుందట.  దీనికి సంబంధించిన ఫీచర్లు ముందుముందు ఇంకెన్ని వెలుగులోకి వస్తాయో చూడాల్సివుంది.