Nov 26,2020 20:52

న్యూఢిల్లీ: దేశంలో కరోనా మరోసారి విజఅంభిస్తున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. డిసెంబర్‌ 31 వరకు అన్ని అంతర్జాతీయ విమనాలను రద్దు చేసినట్లు గురువారం ప్రకటించింది. కొన్ని ప్రత్యేక రూట్లలో మాత్రమే పరిస్థితులకు అనుగుణంగా విమానాలను నడపనున్నట్లు డైరెక్టరేట్‌ జనరల్‌ ఆఫ్‌ సివిల్‌ ఏవియేషన్‌ (డిజిసిఎ) వెల్లడించింది. కాగా ప్రత్యేకంగా అనుమతించిన విమానాలు, కార్గో విమానాలకు ఈ నిబంధనలు వర్తించవని తెలిపింది.