Feb 23,2021 21:01

కొలంబో: శ్రీలంక వికెట్‌ కీపర్‌ ఉపుల్‌ తరంగ అంతర్జాతీయ క్రికెట్‌కు మంగళవారం గుడ్‌బై చెప్పాడు. ట్విటర్‌ వేదికగా... 'ఈ రోజుతో 15ఏళ్ల సుదీర్ఘ కెరీర్‌కు ముగింపు పలకాలనుకుంటున్నా. విఫలమైన ప్రతీసారి నాపై ఉన్న నమ్మకంతో అవకాశాలు కల్పించిన లంక బోర్డుకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నా.. థ్యాంక్యూ ఫర్‌ ఎవ్రీథింగ్‌' అంటూ భావోద్వేగంతో పోస్ట్‌ చేశాడు. 2005లో అంతర్జాతీయ క్రికెట్‌లో అడుగుపెట్టిన తరంగ 2006లో ఇంగ్లండ్‌పై సనత్‌ జయసూర్యతో కలిసి వన్డేల్లో రికార్డు భాగస్వామ్యం 286 పరుగులు నెలకొల్పాడు. 2019లో దక్షిణాఫ్రికాపై ఆఖరి వన్డే ఆడాడు. 235వన్డేల్లో 15 సెంచరీలు, 37అర్ధ సెంచరీలతో 6,951 పరుగులు, 31 టెస్టుల్లో 3సెంచరీలు, 8 అర్థ శతకాలతో 1754 పరుగులు, ఇక 26 టి20ల్లో 407 పరుగులు చేశాడు.