Nov 21,2020 20:25

 హైదరాబాద్ : హీరో నాని వివేక్‌ ఆత్రేయ దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్‌ సంస్థ నిర్మిస్తున్న చిత్రంలో నటిస్తున్నారు. 'అంటే సుందరానికీ' సినిమా టైటిల్‌ పోస్టర్‌ని సోషల్‌ మీడియాలో శనివారం విడుదల చేశారు. నాని పంచకట్టులో లగేజ్‌ బ్యాగ్‌ పట్టుకొని ఉన్నారు. టైటిల్‌ చుట్టూ వీణ, కెమెరా, సైకిల్‌, బూట్లు, తోలుబమ్మలు ఉన్నాయి. ఈ సినిమా కథ వినోదాత్మకంగా ఉండబోతుందని పరిశీలకుల అంచనా. చిత్రం మ్యూజికల్‌ రొమాంటిక్‌ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్నట్లు నిర్మాతలు నవీన్‌ యెర్నేని, యలమంచిలి రవిశంకర్‌ తెలిపారు. మలయాళ నటి నజ్రియా ఫహాద్‌ ఈ సినిమాలో హీరోయిన్‌.