Apr 27,2021 21:00

ఢిల్లీ : కరోనా కట్టడి కోసం దేశవ్యాప్తంగా విధిస్తున్న ఆంక్షల కారణంగా ఇప్పటికి వ్యాపార రంగంలో 5లక్షల కోట్ల రూపాయల మేర నష్టం వాటిల్లింది. ఈ మేరకు అఖిల భారత వాణిజ్య సమాఖ్య (సిఐఎటి) ఒక నివేదికను రూపొందించింది. కరోనా వ్యాప్తి నేపథ్యంలో ముంబాయి, ఢిల్లీలతో పాటు అనేక నగరాలు, పట్టణాల్లో ఆంక్షలు కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఫలితంగా దేశవ్యాప్తంగా చిల్లర వర్తకులు 3.5 లక్షల కోట్ల రూపాయలు, హోల్‌సేల్‌ వ్యాపారులు 1.15 లక్షల కోట్ల రూపాయల మేర నష్టపోయినట్టు ఈ సంస్థ అంచనా వేసింది. వివిధ రాష్ట్రాల్లోని వ్యాపార సంస్థల సంఘాలతో చర్చించిన అనంతరం ఈ నిర్ణయానికి వచ్చినట్లు పేర్కొంది. ఆంక్షల కారణంగా దుకాణాలకు వచ్చే కస్టమర్ల సంఖ్య 80 శాతం పడిపోయిందని, ప్రధాన నగరాల్లో ఇది మరింత ఎక్కువగా ఉందని ఈ నివేదికలో తెలిపింది. ఒక్క ఢిల్లీ నగరంలోనే వ్యాపారులు 25 రోజల వ్యవధిలో 25 వేల కోట్ల రూపాయల మేర వ్యాపారం కోల్పోయారని పేర్కొంది.