Jul 30,2021 21:04

matladutunna jayarao

అంగన్వాడీ ఉద్యోగులు పాల్గొనాలి : సిహెచ్‌.జయరావు
మచిలీపట్నం కల్చరల్‌ : మచిలీపట్నం మండల పరిధిలో తపసిపూడి అంగన్వాడీ సెంటర్లో శుక్రవారం అంగన్వాడీ యూనియన్‌ సెక్టార్‌ సమావేశం నిర్వహించారు. ఆగస్టు తొమ్మిదో తేదీన జరిగే సేవ్‌ ఇండియాలో అంగన్వాడీ కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొనాలని సి ఐ టీ యూ రూరల్‌ మండల కార్యదర్శి సిహెచ్‌ జయరావు పిలుపుఇచ్చారు. కేంద్రంలోని బిజేపి ప్రభుత్వం కార్మిక, రైతాంగ వ్యతిరేక చట్టాలను రద్దుచేసి నూతన ఆర్థిక విధానాల ద్వారా రైతులను, కార్మికులను నట్టేట ముంచుతోందన్నారు. ప్రభుత్వ రంగానికి చెందిన అన్ని రకాల ఆస్తులను ప్రయివేటు, పెట్టుబడిదారులకు ధారాదత్తం చేస్తోందన్నారు. ఈకార్యక్రమంలో సిఐటియు రూరల్‌ మండల అధ్యక్షులు కె.లక్ష్మి పాల్గొన్నారు.