Oct 24,2020 19:01

ఒకప్పుడు టాలీవుడ్‌లో హీరో ఇమేజ్‌ ఉన్న హీరోయిన్‌ విజయశాంతి. నేడు అనుష్కశెట్టి. ఏ పాత్రలో అయినా అనుష్క అలా ఒదిగిపోతారు. ఆమెకు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న పాపులారిటీ అంతా ఇంతా కాదు. 'అరుంధతి', 'బాహుబలి', 'రుద్రమదేవి', 'భాగమతి' సినిమాల్లో 'అనుష్క ప్రత్యేక పాత్రల్లో శభాష్‌ అనిపించుకున్నారు. ఇప్పుడు ఆ టైపు పాత్రలకు భిన్నంగా 'నిశ్శబ్దం'లో అనుష్క నటించి అరుదైన రికార్డు పొందారు.

అరుంధతి, బాహుబలి, రుద్రమదేవి, భాగమతి వంటి సూపర్‌హిట్‌ చిత్రాలతో స్టార్‌ హీరోయిన్‌గా తిరుగులేని క్రేజ్‌ను సంపాదించుకుని లేడీ ఓరియెంటెడ్‌ చిత్రాలకు కేరాఫ్‌ అడ్రస్‌గా నిలిచిన టాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్‌ అనుష్క ప్రధానపాత్రలో నటించిన చిత్రం 'నిశ్శబ్దం'. ప్రపంచ వ్యాప్తంగా తెలుగు, తమిళ, మలయాళ, హిందీ, ఇంగ్లీష్‌ భాషల్లో అక్టోబర్‌ 2న అమెజాన్‌ ప్రైమ్‌ ద్వారా విడుదలైంది. హేమంత్‌ మధుకర్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని క్రితి ప్రసాద్‌ సమర్పణలో కోన ఫిల్మ్‌ కార్పొరేషన్‌ అసోసియేషన్‌లో పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టీజీ విశ్వప్రసాద్‌, కోన వెంకట్‌ ఈ చిత్రాన్ని నిర్మించారు. చిత్ర ప్రమోషన్‌లో భాగంగా స్వీటీ అనుష్క జూమ్‌ వీడియో ద్వారా మీడియాకు సినిమా విశేషాలను తెలియజేశారు.
ఆమె మాట్లాడుతూ.. 'నేను కావాలని సినిమా సినిమా మధ్య బ్రేక్‌ తీసుకోవడం లేదు. భాగమతి తర్వాత మాత్రం కావాలనే బ్రేక్‌ తీసుకున్నాను. ఆ టైమ్‌లోనే నిశ్శబ్దం స్క్రిప్ట్‌ కోన వెంకట్‌ చెప్పారు. స్క్రిప్ట్‌ వినగానే చాలా కొత్తగా అనిపించింది. కథ నాకు ఎంతగానో నచ్చింది.''నిశ్శబ్దం'' మూవీలో నా క్యారెక్టర్‌ చాలా డిఫరెంట్‌గా ఉంటుంది. నా పాత్రపేరు సాక్షి. ఇందులో నాకు వినబడదు, కనబడదు. చాలెంజింగ్‌గా తీసుకుని మరీ ఈ పాత్ర చేశాను. ఈ సినిమా కోసం అమెరికా సైన్‌ లాంగ్వేజ్‌ నేర్చుకున్నాను. బెటర్‌ పెర్ఫార్మెన్స్‌ ఇవ్వడం కోసం అమెరికాలో రెండు నెలలు ట్రైనింగ్‌ తీసుకుని, ఇంటర్నేషనల్‌ సైన్‌ లాంగ్వేజ్‌ నేర్చుకున్నాను. ప్రతిరోజూ ప్రాక్టీస్‌ చేసేదాన్ని.
ఇదొక హారర్‌ థ్రిల్లర్‌ మూవీ. నా పాత్రే ఒక్కటే లీడ్‌ కాదు. మాధవన్‌, షాలిని పాండే, అంజలి, హాలీవుడ్‌ నటుడు మైకేల్‌ మ్యాడిసన్‌, సుబ్బరాజు సహా అందరూ ఇంపార్టెంట్‌ రోల్‌ ప్లే చేశారు. నా ఒక్కదాని మీదే ప్రెజర్‌ ఉందని చెప్పను. ఒక సినిమా 24 క్రాఫ్ట్స్‌ వర్క్‌ చేస్తేనే రూపుది ద్దుకుంటుంది. ఒక్కరు కాదు అందరి సపోర్ట్‌ అవసరం. అందరూ కలిసి పనిచేస్తేనే విజయం వస్తుంది. నా ఒక్కదానిపైనే ఒత్తిడి ఉంటుందనేది కానీ, విజయానికి నేనే కారణం అనే మాటలను నేను ఒప్పుకోను!' అంటూ ఎంతో వినమ్రంగా చెప్తోంది అనుష్క.
అరుదైన అవార్డు!
తొలిరోజే 'నిశ్శబ్దం' అత్యధిక వ్యూస్‌ను సాధించింది. కేవలం మూడు వారాల్లోనే మరో ఫీట్‌ను అందుకుంది. అమెజాన్‌ ప్రైమ్‌లో విడుదలై అత్యధిక వ్యూస్‌ సాధించిన ఫీమేల్‌ సెంట్రిక్‌ సౌత్‌ ఇండియన్‌ మూవీగా 'నిశ్శబ్దం' అరుదైన రికార్డును అందుకుంది.
'నిశ్శబ్దం' సినిమాకు విమర్శకుల నుంచి మిశ్రమ స్పందన వచ్చింది. అలాగే, ఆడియన్స్‌ నుంచి డివైడ్‌ టాక్‌ను ఈ చిత్రం సొంతం చేసుకుంది. చిత్ర కథ గొప్పగా లేకపోయినా మంచి సాంకేతిక విలువలు, డైరెక్టర్‌ నెరేషన్‌ సినిమాను ఆకర్షణీయంగా తయారుచేశాయి. ఈ చిత్రానికి గోపీ సుందర్‌ పాటలు స్వరపరిచారు. గిరీష్‌ గోపాలక్రిష్ణన్‌ నేపథ్య సంగీతం సమకూర్చారు. షనీల్‌ డియో సినిమాటోగ్రఫీ అందించారు.

 

పేరు : అనుష్క శెట్టి
ముద్దు పేరు : స్వీటి, టొమ్ములు
పుట్టిన తేది : 1981, నవంబరు 7
పుట్టిన స్థలం : మంగుళూరు (కర్ణాటక)
మాతృభాష : తుళ్లు
విద్యాభ్యాసం : పాఠశాల, కళాశాల విద్య బెంగళూరులోనే
సినీరంగానికి పరిచయం చేసిన వ్యక్తులు :
ప్రఖ్యాత యోగా నిపుణుడు భరత్‌ ఠాకూర్‌,
సినీనటుడు నాగార్జున
గుర్తింపు తెచ్చిన సినిమా : అరుంధతి
తొలి పరిచయం : సూపర్‌ (తెలుగులో)
అవార్డులు : నంది స్పెషల్‌ జ్యూరీ అవార్డు (అరుంధతి),
ఫిల్మ్‌ఫేర్‌ అవార్డు ఫర్‌ బెస్ట్‌ యాట్రస్‌ (వేదం),
ఫిల్మ్‌ఫేర్‌ ఉత్తమనటి (నాగవల్లి)

anuska 1