Dec 03,2021 22:01

మౌంటెన్‌ డ్యూ సంస్థ సూపర్‌స్టార్‌ మహేష్‌బాబును తమ బ్రాండ్‌ ప్రచారకర్తగా ఎన్నుకున్నట్లు వెల్లడించింది. 'డర్‌ కే ఆగే జీత్‌ హై'  సిద్ధాంతాన్ని మరింత ముందుకు తీసుకురానుందని  పెప్సీ కో ఇండియా సంస్థ మౌంటెన్‌ డ్యూ అండ్‌ స్టింగ్‌, పెప్సికో ఇండియా డైరెక్టర్‌ వినీత్‌శర్మ,అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారతదేశవ్యాప్తంగా బ్రాండ్‌ తెగువ, సాహసం, ధైర్యం, దాని వినియోగదారుల వ్యక్తిత్వాన్ని నిర్వచించేటటువంటి పేరు, మహేష్‌బాబుతో చేతులు కలపడాన్ని మేము గర్వంగా భావిస్తున్నామన్నారు. బ్రాండ్‌ సిద్ధాంతమైనటువంటి 'డర్‌ కే ఆగే జీత్‌ హై' సిద్ధాంతానికి అసలైన ప్రతీకని అతనని కొనియాడారు. దేశవ్యాప్తంగా అశేష అభిమానులను మహేష్‌ కలిగి ఉన్నారని ,ఆయన్ను ఎన్నుకోవడం గర్వంగా వుంది అన్నారు. మహేష్‌బాబు మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ఏదో ఒక రూపంలో భయపడతారని తాను భావిస్తున్నానన్నారు. సినీ నటులు కూడా అందుకు మినహాయింపేమీ కాదన్నారు. మనం ధైర్యంగా, అజేయంగా ఉండాలని కోరుకుంటున్నానన్నారు. అయితే, తనలోని భయాలను, స్వీయ సందేహాలను అధిగమించేందుకు హద్దులను సైతం వెనుక్కినెట్టేసేవాడే అసలైన హీరోఅని వివరించాడు. మౌంటెన్‌ డ్యూ ఫిలాసఫీ 'డర్‌ కే ఆగే జీత్‌ హై' ఎప్పుడూ కూడా తనను బలంగా ప్రతిధ్వనిస్తుందన్నారు. ఎందుకంటే అది తన నమ్మకానికి అనుగుణంగా ఉంటుందన్నారు. అసాధారణత వైపు తనను నెట్టుకోవడాన్ని అమితంగా ఇష్టపడుతుంటానన్నారు. త్వరలో తాను ప్రేక్షకుల కోసం మాయాజాలం చేయడానికి మౌంటెన్‌ డ్యూతో చేతులు కలపడం పట్ల చాలా సంతోషంగా ఉందన్నారు.