Oct 27,2021 19:47

ప్రజాశక్తి - కొవ్వూరు రూరల్‌
జ్వరపీడితులు ఆందోళన చెందొద్దని, ప్రత్యేక వైద్య నిపుణులతో వైద్య సేవలందించి ప్రజల ప్రాణాలను కాపాడతామని రాష్ట్ర స్త్రీ శిశుసంక్షేమ శాఖా మంత్రి తానేటిి వనిత అన్నారు. కొవ్వూరు 1వ వార్డులోని శ్రీరామ్‌ కాలనీలో బుధవారం మంత్రి ఇంటింటికీ వెళ్లి బాధితులను పరామ ర్శించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ శ్రీరామ్‌ కాలనీలో కొందరు జ్వరాలతో, కాళ్ల నొప్పుల సమస్యతో బాధపడుతున్నట్లు తెలిసిందని, వెంటనే వైద్యులను అప్రమత్తం చేశామని తెలిపారు. అధికారులు సహాయ సహకారాలు అందించే విధంగా చర్యలు తీసుకున్నామన్నారు. అనంతరం మంత్రి చొరవతో అంబులెన్స్‌ ఏర్పాటు చేసి ముగ్గురు బాధితులను ఆసుపత్రికి తరలించారు. మంత్రి వెంట కొవ్వురు ఛైర్‌పర్సన్‌ భావన రత్నకుమారి, డిప్యూటీ డిఎంహెచ్‌ఒ పి.రామగురురెడ్డి, వైద్య నిపుణులు పాల్గొన్నారు.