Nov 30,2020 21:30

ఆందోళన చేస్తున్న రేషన్‌ లబ్ధిదారులు, సిపిఎం నాయకులు

ప్రజాశక్తి-పాచిపెంట : ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా అందిస్తున్న రేషన్‌ అందకపోవడంతో సోమవారం పాచిపెంట ఒకటో డిపో వద్ద లబ్ధిదారులు సిపిఎం ఆధ్వర్యాన ఆందోళన చేశారు. ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా నిత్యావసర వస్తువుల పంపిణీ గడువు సోమవారంతో ముగిసింది. మండలంలో సర్వర్లు సక్రమంగా పనిచేయకపోవడంతో లబ్ధిదారులు అవస్థలకు గురయ్యారు. ఈ నేపథ్యంలో సోమవారం పలు రేషన్‌ దుకాణాల వద్ద సర్వర్లు పనిచేయకపోవడంతో లబ్ధిదారులు ఇంటిముఖం పట్టారు. మండలంలో 12,783 రేషన్‌ కార్డులు ఉండగా, సుమారు 770 మందికి సరుకులు అందలేదని సిపిఎం నాయకులు కోరాడ ఈశ్వరరావు తెలిపారు.