Jul 30,2021 21:11

ప్రజాశక్తి - విజయవాడ అర్బన్‌ : కృష్ణానదిలో దూకి ఆత్మహత్యకు పాల్పడేవారిని 36 మంది ప్రాణాలు కాపాడిన అమరావతి బోటిక్‌ క్లబ్‌ను డైరెక్టర్‌ జనరల్‌ ఆఫ్‌ పోలీస్‌ గౌతమ్‌ సవాంగ్‌ శుక్రవారం జరిగిన కార్యక్రమంలో అభినందించారు. ఎపి ఎస్‌డిఆర్‌ఎఫ్‌ ( ఆంధ్రప్రదేశ్‌ డిజాస్టర్‌ రెస్పాన్స్‌ ) సంస్థ ఆధ్వర్యంలో నగరంలోని ఓహౌటల్‌లో డిజాస్టర్‌ రెస్పాన్స్‌పై ఎగ్జిబిషన్‌ నిర్వహించారు. ఈప్రదర్శన ముగింపు కార్యక్రమంలో అమరావతి బోటింగ్‌ క్లబ్‌ సీఈవో తరుణ్‌ కాకానిని డిజిపి అభినందించారు. ఈసందర్భంగా తరుణ్‌ కాకాని మాట్లాడుతూ వివిధ కారణాల రీత్యా ప్రకాశం బ్యారేజి నుండి కృష్ణానదిలో దూకి ఆత్మహత్యకు ప్రయత్నించే 36 మందిని అమరావతి బోటింగ్‌ క్లబ్‌ సభ్యులు వివిధ సందర్భాలలో రక్షించామని తెలిపారు. ముఖ్యంగా అమరావతి బోటింగ్‌ క్లబ్‌ ఎపిఎస్‌డిఆర్‌ఎఫ్‌ సభ్యులకు లైఫ్‌ సేవింగ్‌ టెక్నిక్స్‌పై కూడా శిక్షణ అందించినట్లు తెలిపారు. ప్రకృతి విపత్తుల సమయంలో ప్రజలను కాపాడేందకుగాను ఎపిఎస్‌డిఆర్‌ఎస్‌కు కావాల్సిన విపత్తు సామాగ్రితో పాటు బోట్లు కూడా సరఫరా చేసినట్లు తెలిపారు. విపత్తు సమయంలో ప్రక్క రాష్ట్రాలకు కూడా తమ సొంత బోట్లను అందించినట్లు తెలిపారు.