
కడపఅర్బన్ విద్యుత్‌శాఖలో షిఫ్ట్ ఆపరేటర్ల అమ్మకాలపై విజిలెన్స్ దర్యాప్తు చేపట్టాలని సిఐటియు జిల్లా అధ్యక్షులు కె.శ్రీనివాసులురెడ్డి డిమాండ్ చేశారు. సోమవారం విద్యుత్ భవన్ ఎస్సి ట్రాన్స్‌కో కార్యాలయం ఎదుట నిరసన చేట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నోటిఫికేషన్ లేకుండా షిఫ్ట్ ఆపరేటర్ పోస్టుల భర్తీపై ప్రభుత్వం జోక్యం చేసుకోవాలని పేర్కొన్నారు. హైకోర్టు ఉత్తర్వుల ప్రకారం పని చేస్తున్న వాచ్మెన్లకు షిఫ్ట్ ఆపరేటర్ పోస్టులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. రాజకీయ సిఫార్సులతో అధికారులు కోట్లాది రూపాయలు అవినీతికి పాల్పడ్డారని తెలిపారు. విచారణ చేపట్టకపోతే ఎస్సి కార్యాలయం ఎదుట నిరసన కార్యక్రమం చేపడతామని పేర్కొన్నారు. స్పందించక పోతే సిఎండి కార్యాలయం ఎదుట నిరాహారదీక్షలు చేపడతామని చెప్పారు. కార్యక్రమంలో కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీనివాసులు, ఎంప్లాయిస్ యూనియన్ నాయకులు సుదర్శన్‌రెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి శంకర్, డిస్కం నాయకలు హరి కేశవరెడ్డి పాల్గొన్నారు.