Apr 08,2021 19:37

'అమ్మాయిలు అణిగిమణిగి ఉండాలంటారు. కానీ నా దృష్టిలో వారు తగ్గేదే.. లే...లా వుండాలి. ఈ డైలాగ్‌ కేవలం సినిమాపరంగా పెట్టలేదు. పర్సనల్‌గా నేను చెప్పుకునే మాట అది. మీలాగే (అభిమానులు) నాకూ భయపడే క్షణాలుంటాయి. ధైర్యం చేసి ముందడుగు వేయి. పడిపోయినా పర్లేదు. తగ్గేదే..లే.. అని అనుకుని ఇంతదూరం వచ్చాను. అమ్మాయిలూ మీరు అలానే వుండండి' అని అంటున్నారు అల్లు అర్జున్‌. బుధవారం పుష్ప టీజర్‌ విడుదల చేస్తున్న సందర్భంగా పైవిధంగా స్పందించారు.