May 04,2021 09:29

వాషింగ్టన్‌ : అమెరికాపై తమ యుద్ధం కొనసాగిస్తామని అల్‌ఖైదా పేర్కొంది. అల్‌ఖైదా నేత ఒసామా బిన్‌ లాడెన్‌ను హతమార్చేందుకు సీల్‌ బృందం చేపట్టిన ఆపరేషన్‌కు పదేళ్లు నిండిన సందర్భంగా అల్‌ఖైదా ప్రతినిధులు ఇరువురు సిఎన్‌ఎన్‌తో మాట్లాడారు. ఆఫ్ఘనిస్తాన్‌ నుంచే కాదు, మిగతా ఇస్లామిక్‌ దేశాల నుండి కూడా అమెరికన్‌ దళాలు వెనక్కి వెళ్లాలి. అంతవరకు ఆ దేశానికి వ్యతిరేకంగా పోరు సాగిస్తాం. గత 19ఏళ్ళుగా ఆఫ్ఘనిస్తాన్‌లో అమెరికా దాడులను తిప్పికొడుతున్న తాలిబన్లను అల్‌ఖైదా ప్రతినిధి ప్రశంసించారు. అల్‌ఖైదా ప్రతినిధులతో మాట్లాడామని సిఎన్‌ఎన్‌ చెబుతున్నదాన్ని మీడియా సంస్థలు నిర్ధారించలేదు. పాశ్చాత్య మీడియాకు ఇంటర్వ్యూలు ఇవ్వడానికి అల్‌ఖైదా తిరస్కరిస్తుంది. తన సొంత గెరిల్లా నెట్‌వర్క్‌ల ద్వారా లేదా ఆడియో, వీడియో టేప్‌ల ద్వారా ప్రకటనలు జారీ చేస్తూ వుంటుంది.