Jan 14,2021 12:50

వాషింగ్టన్‌ : అమెరికాలో ఏడు దశాబ్దాలు అంటే.. 70 ఏళ్ల తరువాత ఓ మహిళా ఖైదీకి మరణ శిక్ష అమలు చేశారు. ఇండియానా రాష్ట్రంలోని టెరే హౌతేలో ఓ హత్య కేసులో దోషి అయిన లీసా మాంట్‌గో మేరీ (52)కి బుధవారం విషపూరిత ఇంజక్షన్‌ ఇచ్చి మరణ శిక్ష అమలు చేశారు. 2004లో ఇండియానాకు చెందిన కుక్కలను పోషించే బాబీ జో స్టిన్నెట్‌ (23) అనే గర్భిణీని లీసా హత్య చేసినట్లు కోర్టులు నిర్ధారించి జైలు శిక్ష విధించాయి. స్టిన్నెట్‌ను లీసా గొంతు నులిమి హత్య చేయడంతోపాటు గర్భాన్ని పదునైన కత్తితో కోసి శిశువును బయటకు తీసింది. ఈ ఘటనలో శిశువు కూడా మరణించింది. ఈ కేసులో లీసాకు ఇండియానా కోర్టు మరణిశిక్ష విధించింది. ఆమె క్షమాభిక్ష పిటిషన్‌ పెట్టుకోగా అధ్యక్షుడు ట్రంప్‌ ఇటీవల తిరస్కరించాడు. తుది నిర్ణయాన్ని సుప్రీం కోర్టుకు వదిలేయడంతో లీసా మరణ శిక్ష అమలుకు సుప్రీం అనుమతిచ్చింది. కాగా, అమెరికాలో ఓ మహిళా ఖైదీకి మరణ శిక్ష అమలు చేయడం 1953 తరువాత ఇదే తొలిసారి.