Feb 23,2021 19:12

సమంత, విజయ్‌ సేతుపతి, రమ్య కృష్ణ ప్రధాన పాత్రల్లో నటించిన తమిళ చిత్రం 'సూపర్‌ డీలక్స్‌'. త్యాగరాజన్‌ కుమార్‌ రాజా దర్శకుడు. ఈ చిత్రాన్ని సిద్ధ్దేశ్వర వైష్ణవి ఫిలింస్‌ పతాకంపై పి.మధుబాబు తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నారు. ఈ చిత్రం ఏప్రిల్‌లో విడుదల కానుంది. నిర్మాత మాట్లాడుతూ 'క్రైమ్‌ కామెడీ కథాంశంతో రూపొందిన చిత్రమిది. జీవితం, నైతిక విలువలు, లింగభేదాలతో పాటు సమాజంలో నెలకొన్న పలు సమస్యల్ని చర్చిస్తూ దర్శకుడు రూపొందించారు. ఒకరోజులో కొందరి జీవితాల్లో చోటుచేసుకున్న పరిణామాలు ఆసక్తిని పంచుతాయి. సమంత, విజరు సేతుపతి నటన, పాత్రచిత్రణ అలరిస్తాయి. తమిళంలో పెద్ద విజయాన్ని సొంతం చేసుకున్న ఈ చిత్రం తెలుగు ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటుంది' అని అన్నారు.