Nov 27,2020 12:21

అమరావతి: నివర్‌ తుపాను తీవ్రత క్రమంగా తగ్గుముఖం పడుతోంది. తిరుపతి సమీపంలో బలహీనపడ్డ నివర్‌ శుక్రవారం ఉదయం వాయుగుండం నుంచి అల్పపీడనంగా మారింది. ప్రస్తుతం కోస్తాంధ్రపై ఆవరించింది. దీని ప్రభావంతో రాబోయే 24గంటల్లో కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో మోస్తరు నుంచి విస్తారంగా వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణశాఖాధికారులు అంచనా వేశారు. దీనివల్ల కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో గంటకు 45 నుండి 55 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తున్నాయని వెల్లడించింది.