Nov 23,2020 09:40

రాజవొమ్మంగి(తూర్పుగోదావరి):మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజుకు సేవలందించిన ఓ శతాధిక వృద్ధుడు మృతి చెందాడు. మండలంలోని కొండపల్లికి చెందిన బీరబోయిన బాలుదొర(111) ఆదివారం తన నివాసంలో మరణించారు. 1924 మేనెలలో కొండపల్లి కేంద్రంగా అల్లూరిసీతారామారాజు బ్రిటీష్‌ వారిపై చివరి పోరాటం చేశారు. అప్పట్లో అల్లూరి సీతారామరాజు ఎత్తయిన కొండలపై ఉండేవారు. ఆ సమయంలో బాలుడిగా ఉన్న బాలుదొర అల్లూరికి ఆహార పదార్థాలు అందజేసేవారు. అల్లూరిని దగ్గరగా చూసే భాగ్యం తనకు కలిగిదంటూ నాటి జ్ఞాపకాలను బాలుదొర స్థానికులతో ఎప్పుడూ గుర్తు చేసుకుంటూ ఉండేవారు. వయసు మీద పడడంతో ఇటీవల మంచం పట్టిన ఆయన ఆదివారం కన్నుమూశారు.

alluri