May 18,2021 22:59

విరాళం అందజేస్తున్న యలమంచిలి సత్యనారాయణ

ప్రజాశక్తి - గ్రేటర్‌ విశాఖ బ్యూరో
అల్లూరి సీతారామరాజు విజ్ఞాన కేంద్రం ఆధ్వర్యాన విశాఖ, అరకులో నడుస్తున్న కోవిడ్‌ ఐసొలేషన్‌ సెంటర్స్‌కు బిహెచ్‌పివి పూర్వ సిఐటియూ నాయకులు, కాకానినగర్‌కు చెందిన యలమంచిలి సత్యనారాయణ రూ.20వేలు విరాళాన్ని సిపిఎం జిల్లా కార్యదర్శి కె లోకనాథం, విశాఖ నగర కార్యదర్శి డాక్టర్‌ బి.గంగారావు, నగర కార్యదర్శివర్గసభ్యులు ఆర్‌కెఎస్‌వి కుమార్‌కు మంగళవారం అందజేశారు.
ఈ కేంద్రాలకు సిపిఎం జగదాంబ జోన్‌ నాయకులు కె.నరసింగరావు రూ.10వేలు విరాళంగా ట్రస్ట్‌ కార్యదర్శి డాక్టర్‌ బి.గంగారావు, ఎం సుబ్బారావుకు మంగళవారం అందజేశారు. వీరిరువురికీ అల్లూరి సీతారామరాజు విజ్ఞాన కేంద్రం ట్రస్టు చైర్మన్‌ సిహెచ్‌.నర్సింగరావు ధన్యవాదాలు తెలియజేశారు.