Dec 03,2021 21:11

బిడబ్ల్యుఎఫ్‌ ప్రపంచ టూర్‌ బ్యాడ్మింటన్‌ టోర్నీ
బాలి: బిడబ్ల్యుఎఫ్‌ ప్రపంచ టూర్‌ బ్యాడ్మింటన్‌ టోర్నీ ఆఖరి లీగ్‌ పోటీల్లో పివి సింధు, కిదాంబి శ్రీకాంత్‌ పరాజయం పాలయ్యారు. శుక్రవారం జరిగిన మూడో, ఆఖరి లీగ్‌ పోటీలో పివి సింధు 12-21, 21-19, 14-21తో టాప్‌ సీడ్‌ ఛో ఛువాంగ్‌ చేతిలో పోరాడి ఓడింది. తొలి రెండో లీగ్‌ మ్యాచుల్లో గెలిచిన సింధు ఈ మ్యాచ్‌లో ఓడినా ఇప్పటికే సెమీస్‌కు అర్హత సాధించింది. ఇక పురుషుల సింగిల్స్‌లో కిదాంబి శ్రీకాంత్‌ వరుసగా మూడో ఓటమిని చవిచూశాడు. కిదాంబి 19-21, 14-21తో లీ-జి-జియో(అమెరికా) చేతిలో వరుససెట్లలో ఓడాడు. మహిళల డబుల్స్‌లో అశ్విని పొన్నప్ప-సిక్కిరెడ్డి జోడీ 21-19, 9-21, 21-14తో డెన్మార్క్‌కు చెందిన బిర్చ్‌-స్మిత్‌ జోడీని చిత్తుచేసి సెమీస్‌ రేసులో నిలిచింది. లక్ష్యసేన్‌ ప్రత్యర్ధి జెంకే(ఇంగ్లండ్‌) టోర్నీ నుంచి వైదొలగడంతో అతడూ సెమీస్‌కు అర్హత సాధించాడు.